News March 14, 2025
అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు జరిగాయి. ఏర్పేడు (M) గోవిందవరానికి చెందిన మోహన్ అమెరికాలోని మెఫ్పిస్, టెనస్సీలో ఉంటున్నారు. నిన్న రాత్రి తన ఫ్రెండ్‌తో కారులో వెళ్లగా.. దుండగుడు తుపాకీతో కాల్చాడు. మోహన్ భుజం, చేతికి బుల్లెట్లు తగిలాయి. గాయాలతోనే కారు నడిపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాళహస్తి MLA బొజ్జల ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
Similar News
News February 21, 2026
నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 21, 2026
నేడు శ్రీవారి ఆలయాల్లో ‘కూటమి’ పూజలు, సంప్రోక్షణలు

AP: వైసీపీ సభ్యులు శ్రీవారి ఫొటోలను శాసనమండలికి తీసుకొచ్చి మహాపచారం చేశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలని, నేడు శ్రీవారి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి జగన్, వైసీపీ సభ్యులు మహాపరాధానికి పాల్పడ్డారని, దీనిపై హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.
News February 21, 2026
భద్రాచలం: ఉరివేసుకున్న ముగ్గురు పిల్లల తండ్రి

అక్రమ సంబంధం బయటపడిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలంలో కలకలం రేపింది. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన రమేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, మైలవరానికి చెందిన సుశీల అనే మహిళతో సంబంధం పెట్టుకొని భద్రాచలంలో నివసిస్తున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో, పరువు పోతుందన్న భయంతో రమేశ్ శుక్రవారం ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు.


