News April 17, 2025
అమెరికాలో తిరుపతి వాసికి మంత్రి పదవి

అగ్రరాజ్యం అమెరికాలో తిరుపతి జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్‌సిన్ స్టేట్‌లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్‌గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
Similar News
News April 19, 2025
రామాపురం: మృతుడు TDP నాయకుడిగా గుర్తింపు

అన్నమయ్య జిల్లా రామాపురంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హసనాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన TDP నాయకుడు ఇరగంరెడ్డి(50) కడపలో బంధువుల పెళ్లికి బైకుపై బయల్దేరారు. రామాపురం పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వెళ్తున్న కారు ఢీకొట్టడంతో చనిపోయారు. ఆయన మృతికి మంత్రి మండిపల్లి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి TDPకి తీరని లోటని పేర్కొన్నారు.
News April 19, 2025
కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 19, 2025
కంది: జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలి: డీఈఓ

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.