News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 17, 2025
అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్‌కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.
News March 17, 2025
అనకాపల్లి: ‘అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి’

స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రతి మండల ప్రత్యేక అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మండల స్థాయి సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమన్వయ కమిటీలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. సింగిల్ యూజ్, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.
News March 17, 2025
11 మంది సెలబ్రిటీలపై కేసులు

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.