News December 29, 2025
అమెరికాలో యాక్సిడెంట్.. మహబూబాబాద్ యువతులు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన కారులో యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నత చదువుల కోసం వెళ్లి విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్తతో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News December 31, 2025
సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.
News December 31, 2025
మార్టిన్‌కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
News December 31, 2025
తిరుపతి SVU పరీక్షల వాయిదా

తిరుపతి SVU పరిధిలో జనవరి 5వ తేదీ నుంచి M.A, MSC, M.Com, M.S Data Science, M.Ed, M.Lisc రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. జనవరి 21 నుంచి నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులు గమనించాలని కోరారు. NET పరీక్షల నేపథ్యంలో PG సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని SFI నాయకులు రెక్టార్‌కు వినతిపత్రం అందజేశారు.


