News February 19, 2026

అమెరికా అమ్మాయి.. తిరుపతి అబ్బాయి లవ్

image

తిరుపతికి చెందిన BSNL రిటైర్డ్ ఉద్యోగి రాజేంద్రన్ పెద్ద కుమారుడు రికీ జోసెఫ్(35) ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడే PhD పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి అమెరికా యువతి బ్రాండీ నొయెల్ల జెడ్(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమె MS చదివి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇరుకుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో బుధవారం వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Similar News

News February 19, 2026

చిత్తూరు: అంతా నాయకుల కనుసన్నల్లోనే.?

image

స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కౌండిన్య, నీవా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందట. తెలిసినా అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొందట. కొందరు మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉంటున్నారట. గంగవరం, పలమనేరు ప్రాంతాలకు చెందిన కొందరు నేతల పేర్లు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తవణంపల్లె-పూతలపట్టు సరిహద్దులోని నీవా నది ఓ బడా నేత ఆక్రమణల ధాటికి మౌలిక స్వరూపమే కోల్పోతోందట. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

News February 19, 2026

హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్లు.. ₹70,000 కోట్లకు లెక్క లేదు!

image

హైదరాబాద్ బిర్యానీ చైన్ రెస్టారెంట్స్ ₹70,000 కోట్ల మేర సేల్స్ లెక్కల్లో చూపలేదని ఆదాయపన్ను శాఖ గుర్తించింది. బిల్స్ డిలీట్, ఎడిటింగ్ వంటివి చేస్తూ తక్కువ సేల్ చూపించి పన్ను ఎగ్గొడుతున్నట్లు గుర్తించింది. బిల్లింగ్‌కు వాడే సాఫ్ట్‌వేర్ డేటాను Ai సహా లేటెస్ట్ టూల్స్‌తో విశ్లేషించగా ఇది తెలిసింది. 2019-20 సం. నుంచి విశ్లేషించిన 10% డేటాతో TN, KA, TG, MH, GJ రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తేలింది.

News February 19, 2026

చిత్తూరు: మామిడి రైతులకు రూ.1కే.!

image

మామిడి కవర్లను 50% సబ్సిడీపై అందించనున్నట్లు చంద్రగిరి HO శైలజ గురువారం తెలిపారు. రైతుకు గరిష్ఠంగా 1హెక్టారుకు 15 వేల కవర్లు ఇస్తామని, ఒక కవరు రూ.2లు కాగా, రైతు రూ.1 చెల్లించాలన్నారు. చంద్రగిరి, పాకాల (M) లోని ఆసక్తి గల రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు, పాస్ బుక్, ఫొటో‌తో రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కవర్ల వలన పంటకు పురుగుల దెబ్బ, వ్యాధులు తగ్గి నాణ్యమైన దిగుబడి వస్తుందని HO తెలిపారు.