News December 22, 2024
అమెరికా అమ్మాయి.. సిద్దిపేట అబ్బాయి ఒకటయ్యారు
సిద్దిపేట అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన వడ్డేపల్లి సురేంద్రనాథ్-అండాలు దంపతుల 2వ కొడుకు శ్రీనాథ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో USకు చెందిన చిన్న పిల్లల వైద్యురాలు క్రిస్టల్‌ను ప్రేమించారు. ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరు సిద్దిపేటలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. సప్తసముద్రాలు దాటిమూడు ముళ్ల బంధంతో వారు ఒక్కటయ్యారు.
Similar News
News December 22, 2024
సంగారెడ్డి: శ్రీశైలం వెళ్తుండగా యాక్సిడెంట్.. యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్‌పై శ్రీశైలం వెళ్తున్నారు. శనివారం రాత్రి NGKL జిల్లా మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు.
News December 22, 2024
మెదక్ జిల్లాకు రానున్న ప్రముఖులు
మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ, 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మెదక్ చర్చి 100 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో వీరు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈనెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కౌడిపల్లి మండలం ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సేంద్రియ రైతులతో సమావేశం అవుతారు.
News December 22, 2024
మెదక్: నేడు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన ఇలా..
మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం పర్యటించనున్నారు. రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో మెదక్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం కుల్చారం రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. నర్సాపూర్‌లో గల బీవీఆర్ఐటి కళాశాల సందర్శించి, రోడ్డు మార్గంలో రాజ్ భవన్ చేరుకుంటారు.