News May 26, 2024

అమెరికా యూత్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న అనన్య

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలానికి చెందిన అనన్యకు ఆమెరికా ప్రభుత్వం యూత్ అచీవ్మెంట్ అవార్డు అందించింది. వాషింగ్టన్‌లో పలు సేవా కార్యాక్రమాలు చేసినందుకు గాను ఈ అవార్డు వరించింది. కాగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఈ అవార్డును అనన్య అందుకున్నారు.

Similar News

News February 8, 2026

కమ్మర్‌పల్లి: ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడలు

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐ గడ్డం నగేశ్, సర్పంచ్ కొత్తపల్లి హారిక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు. క్రీడాలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనాలని కోరారు.

News February 8, 2026

NZB మేయర్ BJP గెలిస్తే ప్రధాని వస్తారు: రఘునందన్ రావు

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ మేయర్ స్థానాన్ని గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి వస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేరళ తిరువనంతపురంలో మేయర్ అభ్యర్థి గెలిస్తే ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లారని గుర్తు చేశారు. అలాగే ఇక్కడికి వస్తారని హామీ ఇచ్చారు.

News February 8, 2026

NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.