News February 26, 2026
అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం: చుక్కా రాములు

అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
జగిత్యాల: పీఎం పోషణ్ తనిఖీ.. కేజీబీవీని సందర్శించిన కలెక్టర్

జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. పీఎం పోషణ్ తనిఖీలో భాగంగా మధ్యాహ్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. పదో తరగతి ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News February 27, 2026
డోంట్ వర్రీ.. పులి కదలికల్ని గమనిస్తున్నాం: రంప FRO

పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్‌లోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాలలో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పులి కదలికలు డ్రోన్ థెర్మల్ ఇమేజ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఆందోళన చెందవద్దని ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు..
News February 27, 2026
మార్చి 3న కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు నిలిపివేత

చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదిన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30వరకు కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తునట్టు ఈఓ శోభారాణి తెలిపారు. ఆరోజు ఉదయం పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేయనున్నట్టు తెలిపారు. గ్రహణానంతరం రాత్రి సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.


