News June 25, 2024
అమ్మవారి మాలధారణలో పవన్ కళ్యాణ్

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ అమ్మవారి మాలలో దర్శమమిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ MLAలకు ఆయన శాసనసభ వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని సమస్యలపై ఆయన దూకుడు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ అవగాహన కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కూడా హాజరయ్యారు.
Similar News
News January 8, 2026
రేపే రాజమండ్రిలో జాబ్ మేళా!

రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జనవరి 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగి 19-35 వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల వారు నేరుగా మోడల్ కెరీర్ సెంటర్‌లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని సూచించారు.
News January 8, 2026
బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News January 7, 2026
సంక్రాంతికి నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు: DM

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధనుంజయ్ తెలిపారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు నిడదవోలు – విజయవాడ మార్గంలో నాలుగు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


