News February 27, 2026
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.
Similar News
News March 1, 2026
పాక్‌కు చుక్కలు చూపించిన లంక

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టును సెమీస్ చేరకుండా ఇంటికి పంపడమే కాకుండా దాదాపు గెలిచినంత పనిచేసింది. 213 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 207 రన్స్ చేసి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 28 రన్స్ కొట్టాల్సి ఉండగా శనక(31 బంతుల్లో 76*) 3 సిక్సర్లు బాదడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే చివరి రెండు బాల్స్ డాట్ కావడంతో పాక్ గట్టెక్కింది.
News March 1, 2026
ట్రంప్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్

యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే ఉపయోగించాం. త్వరలో మేం వాడే వెపన్స్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు’ అని హెచ్చరించింది. ఇక వెస్ట్ ఏషియాలోని 14 యూఎస్ బేస్‌లను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దాడుల్లో వందల మంది అమెరికా సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే దీన్ని US ధ్రువీకరించలేదు.
News February 28, 2026
INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

T20WC S-8లో రేపు కోల్‌కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను బాలెన్స్‌డ్‌గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్‌పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్‌ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.


