News November 19, 2024
అమ్మాయిలు ధీటుగా రాణించాలి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5శాతం మంది మాత్రమే మహిళా పైలెట్లు ఉండగా, మన దేశంలో 15శాతం మంది ఉండటం గమనార్హమని కేంద్ర పార విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా పైలెట్ల సంఖ్యను 25 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ప్రకటించారు.
Similar News
News January 27, 2025
SKLM: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: కలెక్టర్
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
News January 27, 2025
SKLM: 28 నుంచి దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాలు
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఈ నెల 28 నుండి 30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్ లోను, 29న టెక్కలి తహశీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. అర్హులను గుర్తించి ఉపకరణాల పంపిణీ చేస్తామన్నారు.
News January 27, 2025
ఈజిప్ట్‌లో సిక్కోలు క్రీడాకారుడి ప్రతిభ
టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీహెచ్. పూర్ణారావు ఈజిప్ట్ దేశంలో తన ప్రతిభను కనబరిచారు. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ఈజిప్టులో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో రెండు GOLD MEDALS తో పాటు ఒక BRONZE మెడల్ సాధించి సిక్కోలు కీర్తిని చాటారు. పూర్ణారావు ప్రతిభ పట్ల పలువురు అభినందించారు.