News December 18, 2024

అమ్మాయిల డేటింగ్.. హైకోర్టుకు చేరిన పంచాయితీ

image

తనతో సహజీవనం చేస్తున్న జ్యోతి అనే యువతిని తన తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పల్లవి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు జ్యోతిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఘటనపై న్యాయమూర్తులు జ్యోతితో మాట్లాడి ఆరా తీశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ విచారణను ముగించారు.

Similar News

News February 19, 2026

మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పెనమలూరులో ఈనెల 21న జాబ్ మేళా
* మచిలీపట్నంలో రైల్వే జాబ్ స్కామ్
* కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష
* విజయవాడలో డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
* బందర్‌లో బెల్ట్ దందా
* గుడివాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
* గూడూరులో కొడుకు పై పేకాట కేసు.. తండ్రి ఆత్మహత్యాయత్నం

News February 18, 2026

కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.