News April 17, 2025

అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

image

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్‌ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్‌, కో-లివింగ్ కల్చర్‌ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.

Similar News

News December 22, 2025

HYD: 10th విద్యార్థులకు ఇదే లాస్ట్ ఛాన్స్

image

10th విద్యార్థలకు ఇదే లాస్ట్ ఛాన్స్.. నామినల్ రోల్స్‌లో ఏమైనా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవాలని నాంపల్లిలోని SSC బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 30 వరకు మాత్రమే అవకాశముందని బోర్డు డైరెక్టర్ పీవీ.శ్రీహరి తెలిపారు. తల్లిదండ్రులూ పాఠశాలలకు వెళ్లి పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులే ఇందుకు బాధ్యత వహించాలని ఆదేశించారు.

News December 22, 2025

ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో TG అధ్యాపకుడికి గోల్డ్ మెడల్

image

బెంగుళూరులో జరిగిన 76వ ఆల్ ఇండియా కామర్స్ సదస్సులో తెలంగాణకు చెందిన డాక్టర్ రామకృష్ణకు గోల్డ్ మెడల్ లభించింది. ఓయూ పూర్వ విద్యార్థి అయిన రామకృష్ణ ప్రస్తుతం కేరళ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండోజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీని డిజిటల్ ఎకానమీలో సమీకరించడంపై సమర్పించిన పరిశోధనా పత్రం ఉత్తమంగా ఎంపికైంది.

News December 22, 2025

నేడు నెక్లెస్ రోడ్డులో ‘మాక్ డ్రిల్’

image

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా సోమవారం నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో ‘మాక్ ఎక్సర్సైజ్’ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, హైడ్రా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. విపత్తు వేళ వివిధ శాఖలు సమన్వయంతో ఎలా స్పందించాలనే అంశంపై ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.