News December 23, 2025
అమ్మిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఎన్నికపై కలెక్టర్‌కు ఫిర్యాదు

అమ్మిరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఎన్నిక సక్రమంగా జరగలేదని సర్పంచ్ లక్ష్మితో పాటు ఏడుగురు వార్డు సభ్యులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న తమను బెదిరించి బలవంతంగా ఎన్నిక నిర్వహించారని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని వారు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.
Similar News
News December 23, 2025
ఆ అవినీతిలో పవన్‌కూ వాటాలు: అంబటి

AP: లోకేశ్ అవినీతిలో పవన్‌కు వాటా ఉందని YCP నేత అంబటి రాంబాబు ఆరోపించారు. మెడికల్ కాలేజీల దందాలోనూ ఆయనకు వాటా ఉన్నట్లుందని, అందుకే అరెస్టు అనేసరికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ‘సీజ్ ద షిప్ అన్నారు. ఏమైంది? పోర్టులో అక్రమ రవాణా మరింత పెరిగింది. నాగబాబుకు మంత్రి పదవి అన్నారు. ఓ డీఎస్పీ సెటిల్మెంట్లు చేస్తున్నారని, శిక్షించాలని అడిగారు. ఏమైనా అయ్యాయా? కూటమిలో మీ పరిస్థితి అదీ’ అని ఎద్దేవా చేశారు.
News December 23, 2025
గుంటూరులో చారిత్రక కుగ్లర్ ఆసుపత్రి

గుంటూరులోని కుగ్లర్ ఆసుపత్రికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దీనిని అమెరికన్ మిషనరీ డాక్టర్ అన్నా సారా కుగ్లర్ స్థాపించారు. 1883లో చిన్న డిస్పెన్సరీగా మొదలైన ఈ సంస్థ, తర్వాత పెద్ద ఆసుపత్రిగా ఎదిగింది. ఇది భారతదేశంలోనే పురాతన మిషన్ ఆసుపత్రుల్లో ఒకటి. ఆంధ్రా ఇవాంజెలికల్ లూథరన్ మిషన్ దీనిని నిర్వహిస్తోంది. మహిళలు, పిల్లల వైద్యానికి ఇది పెట్టింది పేరు. గుంటూరు నడిబొడ్డున, సుమారు 18 ఎకరాలలో విస్తరించి ఉంది.
News December 23, 2025
మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి

10 రోజులుగా మేడిపల్లి ఓసీపీతోపాటు గోలివాడ, మల్యాలపల్లి, మల్కాపూర్ శివారుల్లో పెద్ద పులి సంచరించిన విషయం విధితమే. ఈ రోజు మల్కాపూర్ గ్రామ శివారు గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లా ఇందారం ఏరియాలోకి పెద్ద పులి వెళ్లింది. స్థానిక గోదావరిలో పెద్ద పులి పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్ద పులి సంచారంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు దీంతో ఊపిరి పీల్చుకున్నారు.


