News October 14, 2025

అమ్మో కోఠి ENT.. ఇకనైనా మారుతుందా..?

image

దశాబ్దాల చరిత్ర కలిగిన HYD కోఠి ప్రభుత్వ ENT ఆస్పత్రి ప్రస్తుతం రోగులు, వైద్య సిబ్బందికి నరకంగా మారింది. ఆస్పత్రి ఆవరణ, వార్డుల్లోకి సమీప మురుగు నీరు రావడంతో ప్రాణాలను నిలబెట్టాల్సిన చోటే అపరిశుభ్రత, తీవ్ర దుర్వాసన రాజ్యమేలుతోంది. దీంతో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్(TGMSIDC) నూతన సమీకృత భవన నిర్మాణానికి రూ. 24.38 కోట్ల టెండర్‌ను ఆహ్వానించగా 18 నెలల్లో ఆసుపత్రిని ఆధునికీకరించనుంది.

Similar News

News October 14, 2025

ALERT: రేపు భారీ వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరులోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 14, 2025

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు: మంత్రి

image

ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కర్నూలులో సమీక్ష, పర్యవేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

News October 14, 2025

స్వదేశీ యాప్స్‌పై పెరుగుతున్న మోజు!

image

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో తర్వాత స్వదేశీ మ్యాప్స్ యాప్ ‘MapmyIndia’ ఇన్‌స్టాల్స్ భారీగా పెరిగాయి. 1995లో భారతీయ జంట రాకేశ్, రష్మీ వర్మ రూపొందించిన ఈ యాప్, Google Maps కంటే ముందే సేవలు అందిస్తోంది. ఇందులో ఉండే 3D జంక్షన్ వ్యూ ద్వారా సంక్లిష్ట జంక్షన్లలో దారి సులభమవుతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై హెచ్చరికలు, లైవ్ సిగ్నల్ కౌంట్‌డౌన్ వంటి ఫీచర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.