News February 26, 2025

అమ్రాబాద్‌లో సోషల్ ఆడిట్.. రూ.79,402 రికవరీ

image

అమ్రాబాద్ మండలంలో మంగళవారం 14వ రౌండ్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. DRDO అదనపు అధికారి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆడిట్ నిర్వహించగా, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం రూ.79,402 రికవరీ చేశారు. ఇందులో రూ. 75,402 రికవరీ, రూ. 4,000 పెనాల్టీగా ఉంది. ఈ కార్యక్రమంలో SIM అజీమ్, విజిలెన్స్ నజీర్ రాజు, APO శ్రీనివాసులు, AO జంగయ్య, TA, PS తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 15, 2025

మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

image

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.

News December 15, 2025

తిరుపతి జిల్లాకు రాష్ట్రపతి, గవర్నర్ రాక

image

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ డా.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో రేణిగుంట విమానాశ్రయంలో సమావేశమయ్యారు. భద్రతకు సంబంధించిన అంశాలపై, ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, అధికారులు పాల్గొన్నారు.

News December 15, 2025

క్వాయర్ యూనిట్ల అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

image

క్వాయర్ మ్యాట్ యూనిట్లను చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంట్రికోన పర్యటనలో సర్పంచ్ శ్రీనివాస్ ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారు. దీనివల్ల యూనిట్లపై ఆధారపడిన మహిళలకు ప్రభుత్వ రాయితీలు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో దీనిపై విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.