News April 2, 2025
అమ్రాబాద్: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

అమ్రాబాద్ మండలం దోమల పెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నాయి. ఈ చర్యలను పరిశీలించేందుకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు.
Similar News
News November 6, 2025
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

తెనాలి 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజర్‌పేటలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం వారి నుంచి రూ.500 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.
News November 6, 2025
ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.
News November 6, 2025
వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>


