News March 18, 2026
అమ్రాబాద్: రాత్రివేళల్లో ‘నైట్‌జార్’ పక్షి వింత శబ్దాలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట చురుకుగా ఉండే ‘నైట్‌జార్’ పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చెట్టు బెరడు రంగులో ఉండటం వల్ల పగలు దీనిని గుర్తించడం కష్టం. రాత్రి వేళల్లో ఇది చేసే వింత శబ్దాలను చూసి స్థానికులు వేరే జంతువులుగా భ్రమపడుతుంటారని అధికారులు తెలిపారు. పురుగులను ఆహారంగా తీసుకునే ఈ పక్షి అడవిలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.
Similar News
News April 17, 2026
ఎల్లారెడ్డి: కూలర్ మరమ్మతులు.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) తన ఇంట్లో కూలర్ మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలు కావటంతో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
News April 17, 2026
ప్రొద్దుటూరు: కుటుంబంలో నలుగురూ మృతి.!

ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్లో గత నెల 26న అత్త మందలించిందని భువనేశ్వరి కూల్ డ్రింక్‌లో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ 28న భువనేశ్వరి మృతి చెందింది. పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ నెల 10న లిఖిత(11), 15న గణ(9), (నిన్న) 16న సుష్మ (13) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.
News April 17, 2026
GDK: ‘జైత్రయాత్రకు గులాబీ శ్రేణులు తరలి రావాలి’

ఈనెల 20న జగిత్యాలలో జరిగే జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని PDPL జిల్లా BRS అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. GDKలో శుక్రవారం జరిగిన గులాబీ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించేందుకే KCR సభ నిర్వహిస్తున్నారని అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న CM రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.


