News March 25, 2026

అమ్రాబాద్: లాంటానాతో ‘బ్లాక్ గోల్డ్’ ఉత్పత్తి!

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆక్రమణ మొక్క లాంటానాను ‘బయోచార్’గా మార్చే వినూత్న పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల అడవి రక్షణతో పాటు టన్నుకు రూ.7,000 ఆదాయం లభిస్తుందని ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఈ చర్యతో వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడటమే కాకుండా స్థానిక గిరిజనులకు ఉపాధి కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

Similar News

News April 13, 2026

చరిత్రను మరవొద్దు.. ధైర్యాన్ని వీడొద్దు: ఆనంద్ మహీంద్రా

image

జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగి నేటికి 107 ఏళ్లు పూర్తవుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. 1919 ఏప్రిల్ 13న జరిగిన మారణకాండను గుర్తుచేస్తూ.. ఆనాటి స్మారక శిల ఫొటోను ఆయన పంచుకున్నారు. చనిపోయిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదని, స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. క్రూరత్వానికి ధైర్యమే సమాధానమని ఈ చారిత్రక ప్రదేశం మనకు గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

News April 13, 2026

ADB: రిమ్స్‌లో రీల్స్.. ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ

image

ADB రిమ్స్‌లో <<19636529>>మెడికోలు <<>>చేసిన రీల్స్ వ్యవహారంపై అధికారులు సీరియస్ అయ్యారు. Way2Newsలో వచ్చిన కథనంపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విద్యా విల్సన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

News April 13, 2026

కొబ్బరికాయకు కుంకుమ పెడుతున్నారా?

image

హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరిపై కుంకుమ బొట్టు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం శుద్ధత అని, దేవుడికి సమర్పించే ప్రసాదం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలని అంటున్నారు. తెల్లటి గుజ్జుపై కుంకుమ ఉంచడం వల్ల తినదగిన నైవేద్యం స్వచ్ఛత దెబ్బతింటుందని, కావాలంటే పీచుపై పెట్టాలని సూచిస్తున్నారు.