News February 26, 2025

అమ్రాబాద్ : శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నేపథ్యమిదే..!

image

శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో చేసింది. కానీ ఎలాంటి పనులు మొదలు కాలేదు. 22 ఏళ్ల తర్వాత 2005లో దివంగత సీఎం వైఎస్‌అర్ ఎస్‌ఎల్‌బీసీ రూ.2,813కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2006 లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుత అంచనావిలువ రూ.4,637.75 కోట్లకు చేరుకుంది.

Similar News

News March 2, 2026

రేపు కోటప్పకొండ దేవాలయం మూసివేత

image

చంద్రగ్రహణం కారణంగా ఈనెల 3న కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. గ్రహణం ముగిశాక ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను తిరిగి అనుమతిస్తామని వెల్లడించారు. భక్తులు ఈ సమయ మార్పును గమనించాలని ఆలయ వర్గాలు కోరాయి.

News March 2, 2026

నరసరావుపేట: పోలీస్ గ్రీవెన్స్‌కి 92 ఫిర్యాదులు

image

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ బి.కృష్ణారావు పాల్గొన్నారు.
ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలోనే పరిష్కారం అందించేలాచర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక, కుటుంబ, మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించినవి 92 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులుకు రిఫర్ చేశారు.

News March 2, 2026

అనకాపల్లి: కలెక్టర్‌ను కలిసిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు

image

నక్కపల్లిలో అర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సీఈవో దిలీప్ ఒమెన్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్ఆర్ డైరెక్టర్ అశుతోష్ సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కలిశారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమెతో చర్చించారు. భూ సమీకరణ, పునరావాస కాలనీల అభివృద్ధి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా కోసం పైప్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ వారితో సమీక్షించారు.