News March 26, 2026

‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ మీమ్స్.. కారణమిదే!

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా తానే ఉండాలని ఆ దేశ నేతలు అడిగారని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పదవిని తాను కోరుకోలేదని గొప్పలు చెప్పడంపై మీమ్స్ పోటెత్తుతున్నాయి. ‘అయతుల్లా డొనాల్డ్ ట్రంప్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గడ్డంతో ఉన్న ట్రంప్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ‘అయతుల్లాగా ట్రంప్ ఛార్జ్ తీసుకున్నారు. పరిస్థితి దారుణంగా మారొచ్చు’ అని సెటైర్లు వేస్తున్నారు.

Similar News

News April 13, 2026

బెంగాల్ ‘SIR’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

image

ఎన్నికల ఒత్తిడిలో ఓటర్ల హక్కును కాలరాయొద్దని, పుట్టిన దేశంలో ఓటరుగా కొనసాగే హక్కు రాజ్యాంగబద్ధమని CJI సూర్యకాంత్ బెంచ్ పేర్కొంది. బెంగాల్‌ ‘SIR’లో ఓట్లు కోల్పోయిన వారి పిటిషన్లను విచారిస్తూ.. అప్పీళ్లను పరిష్కరించేందుకు పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలంది. ఏప్రిల్ 23, 29న జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఓటరు తుది జాబితాకు గడువు ముగిసినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని వ్యాఖ్యానించింది.

News April 13, 2026

ఆ ₹15,000CR హుష్ కాకేనా!

image

TG: గత GOVTలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట ₹15,000CR మేర పలు ఏజెన్సీలు స్వాహాచేసినట్లు EX CS శాంతికుమారి కమిటీ తేల్చింది. ఇవి అప్పటి మంత్రులు, ప్రముఖుల బంధువులకు చెందినవిగా గుర్తించింది. నిధుల రికవరీ సహా వాటిపై చర్యలు తీసుకోవాలంది. అయితే ప్రభుత్వం ఆ రిపోర్టును పక్కనపెట్టేసింది. చర్యలు లేకపోగా ఆ సంస్థలనే ఇంకా కొనసాగిస్తోంది. ప్రస్తుత GOVTలోని కొందరికి దీనిలో భాగం ఉండడమే కారణమన్న ఆరోపణలున్నాయి.

News April 13, 2026

తిరుగులేనిది ‘సుగ్రీవాజ్ఞ’

image

కచ్చితంగా పాటించాల్సిన ఆదేశాలకు ‘సుగ్రీవాజ్ఞ’ అనే జాతీయాన్ని వాడుతున్నాం. సీతాదేవిని వెతుక్కుంటూ రామ లక్ష్మణులు రుష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడు పరిచయమవుతారు. హనుమంతుడి కారణంగా వారికి స్నేహం ఏర్పడుతుంది. రాముడి సాయంతో తన అన్న వాలిని ఓడించి కిష్కింధ రాజ్యాన్ని పొందుతారు. తర్వాత సీతాదేవి ఎక్కడున్నా అన్వేషించాలని తన వానర సైన్యాన్ని ఆజ్ఞాపిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>