News August 12, 2024

అయిజ: ఉద్ధృతంగా తుంగభద్ర.. నది పొంగే అవకాశం

image

కర్ణాటకలోని తుంగభద్ర డామ్ గేటు కొట్టుకుపోయిన కారణంగా దిగువన ఉన్న తుంగభద్ర నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామ శివారులో సోమవారం తుంగభద్రా నది నిండుకుండలా, ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరో 5 అడుగులు వరద ఉద్ధృతి కొనసాగితే నది పొంగి పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉంది. దీంతో నదీ తీర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.