News April 6, 2024
అయిజ: ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ

అయిజ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ విజయభాస్కర్ వివరాలు మేరకు.. గ్రామానికి కృష్ణారెడ్డి తన ఇంటికి తాళం వేసి పనిమీద కర్నూలు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్ళి పరిశీలించగా రెండు లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారం చోరీకి గురైందని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 31, 2025
రాజాపూర్: బీసీలంతా ఏకం కావాలి: తీన్మార్ మల్లన్న

బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం రాజాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్లో ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్, బీసీ నాయకులు పాల్గొన్నారు.
News October 31, 2025
పరిశ్రమలకు గడువులోగా అనుమతులు ఇవ్వండి: కలెక్టర్ విజయేంద్ర

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ బ్రైడ్ కింద షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆరుగురికి వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ వెల్లడించారు.
News October 30, 2025
‘జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి’

రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన వారికి కేటాయించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని పాలమూరు విశ్వవిద్యాలయం బీసీ అధ్యాపకులు డిమాండ్ చేశారు. గురువారం రిజర్వేషన్ల అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు సమక్షంలో చర్చా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అమలు చేయాలని కోరారు. విశ్రాంత చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.


