News November 18, 2025
అయిజ: డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం

అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్కూల్ నుంచి మాధవ సినిమా టాకీస్ వైపు వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న డ్రైనేజీలో ఒక మగ మనిషి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

AP: తిరుమల పరకామణి కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని సీఐడీ డీజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. కాగా సతీశ్ మృతి కేసును తాజాగా హత్య కేసుగా నమోదుచేసిన విషయం తెలిసిందే.

వెంకటగిరిలో వైన్ షాపులు క్లోజ్

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని 9 వైన్ షాపులు మూతపడ్డాయి. ‘20% మార్జిన్ ఇస్తామని చెప్పడంతో అప్లికేషన్లు వేశాం. తీరా 9% ఇచ్చారు. ఇలా అయితే లైసెన్స్ ఫీజు కట్టలేమని చెప్పడంతో 14% ఇచ్చారు. ఇప్పుడు పర్మిట్ రూములతో పాటు 20వతేదీ లోపు లైసెన్స్ ఫీజు చెల్లించాలంటున్నారు. ఇప్పటికే చాలా అప్పులపాలయ్యాం. ఇక మావల్ల కాదు’ అంటూ అన్ని షాపులు మూసేసి తాళాలు ఎక్సైజ్ ఆఫీసులో ఇవ్వడానికి ఓనర్లు ప్రయత్నించారు.