News March 23, 2025
అయిజ: ధాన్యం బస్తాతో శ్రీశైలం పాదయాత్ర

కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి బసవ అనే భక్తుడు తాను పండించిన తెల్లజొన్న ధాన్యం మల్లికార్జునస్వామికి ముడుపుగా ఇస్తానని మొక్కుబడి పెట్టుకున్నాడు. ఆ మేరకు అతడికి పంట బాగా పండటంతో 50 కేజీల జొన్నల బస్తాను భుజంపై పెట్టుకుని వారం కిందట శ్రీశైలం పాదయాత్ర ప్రారంభించాడు. శనివారం అయిజ మండలం వెంకటాపురం చేరుకున్నాడు. ధాన్యం బస్తా మోస్తూ శ్రీశైలం పాదయాత్ర చేయడం పట్ల నడిగడ్డ వాసులు అతడిని ప్రశంసించారు.
Similar News
News March 24, 2025
నిజామాబాద్: మళ్లీ పెరిగిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.
News March 24, 2025
ఎటపాకకు చెందిన వ్యక్తి గోదావరిలో దూకి ఆత్మహత్య

ఎటపాకకు చెందిన అనిల్ అనే వ్యక్తి భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 10 ఏళ్ల క్రితం అనిల్ భార్య రజిని ఆత్మహత్య చేసుకుందని, అప్పటి నుంచి అనిల్ మనోవేదనకు గురైన మద్యానికి బానిసయ్యాడన్నారు. ఈనెల 16న నుంచి మద్యం తాగడం మానేశాడని.. 20వ తేదీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
News March 24, 2025
అచ్చంపేట POLITICAL.. ‘ఫైర్ బ్రాండ్ జోష్ పెంచాలి’

పాలమూరు రాజకీయాల్లో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014, 2018లో వరుసగా BRS నుంచి గెలిచిన గువ్వల బాలరాజు 2023లో ఓడిపోయారు. ప్రత్యర్థుల మాటలకు దీటుగా కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న గువ్వల బాలరాజు ఇటీవల కొంత సైలెంట్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ గువ్వల బాలరాజు మరింత జోష్ పెంచాలని శ్రేణులు భావిస్తున్నాయి. మీ కామెంట్..?