News February 18, 2025
అయిజ: బైక్ కవర్‌లో 6 తులాల బంగారం చోరీ

అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన వీరేష్ ఓ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆరు తులాల బంగారాన్ని సోమవారం రిలీజ్ చేసుకొని బైక్ కవర్లో ఉంచి ఫర్టిలైజర్ దుకాణం వద్ద పురుగుమందులు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. మందులు కొనుగోలు చేసి బైక్ వద్దకు వచ్చి చూడగా కవర్‌లో ఉన్న బంగారం మాయమైంది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News September 17, 2025
విశాఖలో బిజినెస్ సమ్మిట్‌కు సీఎం, కేంద్రమంత్రి

విశాఖలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పర్యటించనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం జరిగే ‘స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’సభకు వీరిద్దరూ హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అనంతరం 3గంటలకు రాడిసన్ బ్లూలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు రానున్నారు.
News September 17, 2025
సిబ్బందిని అభినందించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన SDRF సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో SDRF సిబ్బంది, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరదల సమయంలో వారు చేసిన సేవలను కొనియాడారు. జిల్లా ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
News September 17, 2025
జగిత్యాల : స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు అవగాహన

SKNR ఆర్ట్స్, సైన్స్ కళాశాల జగిత్యాలలో మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ సెక్యూరిట్స్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్(SEBI) నిపుణులు M.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెట్టుబడులు పెట్టేముందు ఫండమెంటల్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.