News March 31, 2025

అయిజ: ‘రతంగాపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరం’

image

అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు రతంగపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట రాములు, ఆంజనేయులు, హనుమంతు పేర్కొన్నారు. సోమవారం ఉప్పల గ్రామంలో ఆయన భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి యువతను చైతన్యం చేశాడని కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

Similar News

News January 1, 2026

TODAY HEADLINES

image

✦ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న TG CM రేవంత్
✦ ఉద్యోగులకు రూ.713 కోట్లు విడుదల చేసిన TG సర్కార్
✦ గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్
✦ APలో పెరుగుతున్న స్ర్కబ్ టైఫస్ కేసులు.. ఇప్పటివరకు 2 వేలకుపైగా నమోదు, 22మంది మృతి
✦ పెయిన్‌కిల్లర్ డ్రగ్ Nimesulide తయారీ, సేల్స్‌పై బ్యాన్: కేంద్రం
✦ కోమాలోకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్టిన్

News January 1, 2026

ట్రైనీ కానిస్టేబుళ్లకు రూ.12వేలు.. ఉత్తర్వులు జారీ

image

AP: ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంచుతూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న మంగళగిరిలో జరిగిన నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్టైఫండ్‌ను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో 9 నెలలపాటు జరగనుంది.

News January 1, 2026

శుభాకాంక్షలు తెలపండి కానీ.. అవి వద్దు: కలెక్టర్

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన జారీ చేశారు. అయితే జనవరి 1 సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని కలెక్టర్ సూచించారు. అయితే వసతి సంక్షేమ గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల సౌలభ్యం కోసం అవసరమైన పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యాసామాగ్రి తీసుకురావచ్చని కలెక్టర్ కోరారు.