News November 13, 2025

అయిజ: రేపు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

అయిజ మార్కెట్ సబ్ యార్డులో రేపు (శుక్రవారం) సింగిల్ విండో ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు విండో ఛైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి గురువారం Way2News తో తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రంలో అయిజ, గట్టు, మల్దకల్ మండలాల రైతులు మొక్కజొన్న విక్రయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.

Similar News

News November 13, 2025

ములుగు: ఎక్సైజ్ శాఖలో వాహనాలకు వేలంపాట

image

ములుగు ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు రేపు వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. ఉ. 11 గంటలకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు వాహనం ధరలో 50% చెల్లించి పాల్గొనాలన్నారు. వాహనం పొందిన వారు అదే రోజు పూర్తి సొమ్మును చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని కోరారు.

News November 13, 2025

ఈ టిప్స్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ సేఫ్‌

image

ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు 20-80% ఛార్జింగ్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. 100% ఛార్జ్ చేసిన ప్రతిసారీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 25% కంటే తక్కువకు చేరినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. కంపెనీ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. అధిక చల్లదనం, వేడి ప్రాంతాల్లో, బెడ్, బ్లాంకెట్‌పై ఉంచి ల్యాప్‌టాప్ వాడొద్దు. బ్రైట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ బ్యాటరీ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

News November 13, 2025

కరీంనగర్‌ ‘టాస్క్’లో రేపు జాబ్‌ డ్రైవ్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో గల ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న(రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపడుతున్నారు. 2024-25లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు సూచించారు.