News September 9, 2025
అయిజ: హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం

అయిజ ZPHS హెచ్ఎంను సస్పెండ్ చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ MEO రాములును ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయం కంటే విద్యార్థులు ముందుగా ఇంటికి వెళ్లడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు వెళ్లారని హెచ్ఎంను ప్రశ్నించగా మాల పున్నమి కావడంతో ముందుగా వెళ్లారని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన కలెక్టర్ సస్పెండ్ చేయాలని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 10, 2025
ఆసియా కప్: హాంకాంగ్‌పై అఫ్గాన్ విజయం

ఆసియా కప్-2025 తొలి మ్యాచులో హాంకాంగ్‌పై అఫ్గానిస్థాన్ 94 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 188/6 స్కోర్ చేసింది. సెదిఖుల్లా అటల్ (73), అజ్మతుల్లా (53) రాణించారు. అనంతరం ఛేదనలో హాంకాంగ్ 20 ఓవర్లలో 94-9 స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో బాబర్ హయత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచారు.
News September 10, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

ఏలూరు జిల్లాలో ఎక్కడా యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. పోలవరం మండలం ప్రగడపల్లి సొసైటీలో 25 మెట్రిక్ టన్నులు, జిల్లెళ్లగూడెం, వింజరం రైతు సేవా కేంద్రాలకు 12.5 మెట్రిక్ టన్నుల చొప్పున ఒక్కరోజులోనే అదనంగా సరఫరా చేశామని చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
News September 10, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన C.P.రాధాకృష్ణన్
* క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి దామోదర
* గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: TG హైకోర్టు
* సీఎంకు, నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి: KTR
* 4 దశల్లో ఏపీలో స్థానిక ఎన్నికలు: SEC
* ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల
* నేపాల్‌లో ఆర్మీ పాలన.. ప్రధాని రాజీనామా
* నేపాల్ మంత్రులను తరిమికొట్టిన నిరసనకారులు