News November 6, 2025
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.
Similar News
News November 6, 2025
కరివేపాకుతో మెరిసే చర్మం

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులంటున్నారు. * కరివేపాకు, పాలతో చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. * కరివేపాకు మరిగించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి, నిమ్మరసం కలిపి కూడా ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.
News November 6, 2025
డెయిరీఫామ్‌తో రూ.15 లక్షలు నష్టపోయారు..

TG: రెండేళ్ల క్రితం డెయిరీఫామ్ ప్రారంభించి రూ.15లక్షలుపైగా నష్టపోయారు కామారెడ్డి(D) పెద్దమల్లారెడ్డికి చెందిన ఐదుగురు మిత్రులు. రూ.27 లక్షల పెట్టుబడి, 17 గేదెలతో ఫామ్ ప్రారంభించారు. గేదెల ఎంపికలో తప్పులు, అనుభవలేమి, ఊహించని ఖర్చులతో 6 నెలల క్రితం ఫామ్ మూసేశారు. అందుకే డెయిరీఫామ్ పెట్టేముందు పూర్తిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ✍️ పాడి, వ్యవసాయ సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 6, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


