News February 2, 2026

అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

image

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.

Similar News

News February 22, 2026

వేధింపులను ఎదుర్కోవడం నేర్చుకోండి

image

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.

News February 22, 2026

హనీ ట్రాప్.. కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు!

image

TG: పురుషులను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం, రహస్య సమాచారం సేకరించే హనీ ట్రాప్ కేసులు చూస్తుంటాం. కానీ భద్రాద్రి(D) జేత్యాతండాలో దుండగులు కోడిపెట్టను ఎరగా వేసి పుంజును ఎత్తుకెళ్లారు. రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. 3రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కోడిపెట్టను చూపించి, దగ్గరికి వచ్చిన పుంజును పట్టుకొని ఉడాయించారు. జేత్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 22, 2026

AIIMS బీబీనగర్‌లో 26పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

హైదరాబాద్‌లోని AIIMS బీబీనగర్‌లో 26 Jr. రెసిడెంట్, Sr. రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, PG, సంబంధిత విభాగంలో MD, DNB, DM, MS, MCh అర్హత ఉండాలి. జూనియర్ రెసిడెంట్ పోస్టులను అకడమిక్ మెరిట్ ఆధారంగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in