News February 11, 2025
అయినవిల్లి: చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో.. కాపాడిన పోలీసులు

అయినవిల్లి మండలం వీరవల్లి పాలెంకు చెందిన సత్తి వెంకట శ్రీరామ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పిన సెల్ఫీ వీడియో అన్నవరం ఎస్సైకు పంపారు. పెద్దాపురం డిఎస్పీ, పత్తిపాడు సీఐలు స్పందించి అన్ని లాడ్జిలలో తనిఖీలు నిర్వహించారు. అన్నవరం బాలాజీ లాడ్జిలో ఆ యువకుడు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. పోలీసులు ఆ యువకుడిని కాపాడారు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.
Similar News
News July 9, 2025
మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

భారత్‌తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్‌లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. లార్డ్స్‌లో గ్రీన్ పిచ్ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్
News July 9, 2025
HYD: మెట్రో పార్కింగ్.. తప్పించుకోలేరు..!

HYD నగర మెట్రో స్టేషన్లు వద్ద వాహనాలు పార్కు చేసి, ఎవరు చూడని సమయంలో పార్కింగ్ ఫీజు కట్టకుండా బైకులు తీసుకెళ్లినవారు తప్పించుకోలేరని నిర్వాహకులు తెలిపారు. మీరు పార్కు చేసినప్పుడే డిజిటల్ రూపంలో అన్ని వివరాలు పొందు పరుస్తారు. పార్కింగ్ ఫీజు ఆన్ లైన్లో జెనరేట్ అవుతుంది. మరోసారి వచ్చినపుడు కనుక చెల్లిస్తే మీకు తెలియకుండానే గత పెండింగ్ పార్కింగ్ ఫీజు, ప్రస్తుతం ఫీజు కలిపి చెల్లించాల్సి వస్తుంది.
News July 9, 2025
ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ఉత్కృష్ట అవార్డు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్‌కు ప్రతిష్ఠాత్మక ఉత్కృష్ట అవార్డు దక్కింది. ఆయన డిపార్టుమెంటులో అందించిన అత్యుత్తమ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఆయనకు ప్రకటించింది. కమిషనరేట్ పరిధిలోని సీఐ ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల సీపీ సన్ ప్రీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. షుకూర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.