News November 19, 2025
అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.
Similar News
News November 19, 2025
తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.
News November 19, 2025
NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా తమకేం తెలియదని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మంగళవారం బ్యాంకు ముందు నిరసన తెలిపారు.


