News January 10, 2026
అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్ చల్

యూపీలోని అయోధ్య రామమందిరంలో భద్రతా వైఫల్యం తలెత్తింది. కశ్మీర్‌కు చెందిన అబ్ అహద్ షేక్ D1 గేటు నుంచి ఆలయంలోకి ప్రవేశించి హల్ చల్ చేశాడు. ఆలయ ప్రాంగణంలో నమాజ్ చదివేందుకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నినాదాలు చేశాడు. దీనిపై ఆలయ ట్రస్టు స్పందించాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
కరెంటు సమస్యలా? ఈ నంబర్‌కు HI అని మెసేజ్ చేయండి

TGSPDCL వాట్సాప్ చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. 8712441912 నంబర్‌కు HI అని మెసేజ్ చేసి పలు సర్వీసులను పొందవచ్చు. కంప్లైంట్స్ రిజిస్టర్, కంప్లైంట్ ట్రాక్, బిల్ వివరాలు, పవర్ సప్లై స్టేటస్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సమస్యపై ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు. 24/7 ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
#ShareIt
News February 22, 2026
భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం MOU

AP: భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, CM CBN సమక్షంలో MOU జరిగింది. MOUపై భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్ అందించే లక్ష్యంగా ఒప్పందం చేసుకున్నట్లు CM వెల్లడించారు. రాష్ట్రంలోని 13,426 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News February 22, 2026
బుల్లెట్ తగిలినా తగ్గలేదు!

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో టైసన్ అనే శునకం ధైర్యసాహసాలు ప్రదర్శించింది. దాని సహాయంతో పోలీసులు, భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రమూకలను గుర్తించగలిగారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో టైసన్ గాయపడింది. అయినా ఓర్పుతో మిషన్ పూర్తయ్యేవరకు సేవలు అందించింది. గాయపడిన శునకాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


