News October 15, 2025
అయోమయానికి గురి చేస్తున్న పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. గత వారం రూ. 7వేలకు పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. మంగళవారం రూ.6,960 పలికింది. మళ్ళీ ఈరోజు స్వల్పంగా తగ్గి రూ. 6,940కి చేరినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
Similar News
News October 15, 2025
పాదాలు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ C, హైడ్రోక్వినోన్‌లున్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News October 15, 2025
తాడికొండ: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కేసు

తాడికొండ మండలంలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 15, 2025
సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.