News April 9, 2024

అయ్యన్న, సీఎం రమేశ్‌కు నోటీసులు జారీ

image

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని టీడీపీ నేత అయ్యన్న, బీజేపీ నేత సీఎం రమేశ్‌కు ఆర్డీఓ జయరాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న బీజేపీ సమావేశానికి హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసేందుకు వచ్చారు. వారి ఎదుట అయ్యన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తీవ్ర పదజాలంతో విమర్శించారని, సీఎం రమేశ్‌ పక్కనే ఉన్నారని.. ఇద్దరి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు.

Similar News

News October 5, 2025

ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద 46 కేసుల్లో బాధితులకు రూ.79 లక్షల పరిహారం అందించామని, పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మాన్యువల్ స్కావెంజర్ల కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి పరచాలని అధికారులకు సూచించారు.

News October 5, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

image

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో పర్యటించనున్నారు. 5న రాత్రి విశాఖ చేరుకొని హోటల్లో బస చేస్తారు. 6న ఉదయం 10 గంటలకు పోర్టు ఎల్పీజీ బెర్త్ వద్ద శివాలిక్ నౌకను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్టు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15కి విశాఖ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

News October 4, 2025

బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

image

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.