News January 11, 2026
అయ్యప్ప మాల ఎక్కడ వేసుకున్నామో అక్కడే తీయాలా?

ఇలాంటి నియమం లేదు. యాత్ర ముగిశాక ఇంటికొచ్చి గురుస్వామి సమక్షంలో దీక్షా విరమణ చేయవచ్చు. శబరిమలలో మాల తీయకూడదంటారు. మాల ధరించి ఉండటమే స్వామి దర్శనానికి ప్రధాన అర్హత. ఇంటికి చేరాక ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి, మంత్రపూర్వకంగా మాల విరమణ చేయాలి. మాలను పాలలో శుద్ధి చేసి భద్రపరచాలి. స్థలం కంటే భక్తి, క్రమశిక్షణగా ఉండే వ్రత పాలనే ముఖ్యం. పద్ధతిగా దీక్ష ముగిస్తే వ్రత ఫలం పూర్తిగా లభిస్తుంది.
Similar News
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.
News February 21, 2026
NABARDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేయాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క కోరారు. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా జాతరకు విశేష గుర్తింపు లభించేలా విస్తృత ప్రచారం కల్పించిన ట్రస్ట్‌ను అభినందించారు. కాగా జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా హాజరయ్యారు.


