News February 23, 2025
అరకులోయలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్..!

అల్లూరి కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లులకు రూమ్స్ కేటాయించినట్టు సీడీపీఓ శారద పేర్కొన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్‌ను అరకులోయ తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసు, పెదలబుడు సచివాలయం, అరకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించామని సీడీపీఓ తెలిపారు. తల్లులు ఈ సౌకర్యాలను గమనించి వాడుకోవాలని ఆమె కోరారు.
Similar News
News February 23, 2025
బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : ADB MP

ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు చిన్నమయల్ అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని ADB ఎంపీ గోడెం నగేష్ అన్నారు. శనివారం మామడ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రంజిత్ కుమార్, నాయకులు చందు, నారాయణ రెడ్డి, బాపురెడ్డి, రాజారెడ్డి, నవీన్, గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
News February 23, 2025
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 23, 2025
గింజేరు జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.