News December 27, 2025

అరకులోయలో VRO భార్య అనుమానాస్పద మృతి

image

అరకులోయలోని సి.కాలనీలో నివాసముంటున్న వాలసి VRO కొండలరావు రెండో భార్య రత్నలమ్మ(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం ఆమె తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని మృతురాలి కుమారుడు బాలకృష్ణ గుర్తించారు. వెంటనే అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వేణుగోపాల్ రావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

Similar News

News December 28, 2025

ఏడవ నేర్చిన వ్యవసాయము

image

ఒక పనిని ఇష్టం లేకుండా, అయిష్టంగా లేదా ఏడుస్తూ చేస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనులను ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో చేయాలి. అలా కాకుండా “ఏడుస్తూ” లేదా అయిష్టంగా చేస్తే, ఆ పంట సరిగా పండదు, పైగా అది నష్టాలకే దారితీస్తుంది. ఎవరైనా ఒక పనిని అయిష్టంగా చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదని తెలిపే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 28, 2025

TG: ఈ ఆలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం

image

వైకుంఠ ఏకాదశి వేడుకలు భద్రాచలంతో పాటు యాదగిరిగుట్ట, ధర్మపురి, హైదరాబాద్ TTD క్షేత్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. స్వర్ణగిరి వేంకటేశ్వర, చిలుకూరు బాలాజీ ఆలయాల్లో గతంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. శివాలయమే అయినా అనంత పద్మనాభ స్వామి కొలువైనందుకు వేములవాడలోనూ ఉత్తర ద్వార దర్శనాలుంటాయి. స్థానిక వైష్ణవాలయాల్లోనూ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.

News December 28, 2025

నేడు నాలుగో టీ20.. భారత్‌కు ఎదురుందా?

image

శ్రీలంక, భారత మహిళా జట్ల మధ్య ఇవాళ నాలుగో T20 జరగనుంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలిచి 5 T20ల సిరీస్‌ను టీమ్ఇండియా చేజిక్కించుకుంది. మిగతా 2 మ్యాచుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. 7PM నుంచి స్టార్ స్పోర్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.