News September 16, 2024

అరకులోయ: మళ్లీ పెరిగిన అల్లం ధరలు

image

అల్లం ధర మళ్లీ పెరిగింది. ఇటీవల మన్యంలో వర్షాలు అధికంగా పడటంతో అల్లం పంట దెబ్బతింది. దీంతో దిగుడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. జూన్, జులై నెలల్లో అల్లం ధర కేజీ రూ.150 ఉండగా ఆ తరువాత కేజీ రూ.120 నుంచి రూ.130కి తగ్గింది. ప్రస్తుతం చింతపల్లిలో కేజీ రూ.200కు విక్రయిస్తున్నారు. త్వరలో కొత్త అల్లం మార్కెట్లోకి వస్తుంది. ఇది వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.

Similar News

News September 21, 2025

నాగావళి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

విశాఖ మీదుగా సంబల్పూర్ – నాందేడ్ (20809) వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రీ షెడ్యూలు అయింది. సంబల్పూర్‌లో ఆదివారం ఉదయం 10.50 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రీ షెడ్యూలు జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.

News September 21, 2025

విశాఖలో శొంఠ్యాం కోడి రూ.300

image

మాధవధార, మురళి నగర్, మర్రిపాలెంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ చికెన్ లైవ్ రూ.160, స్కిన్ లెస్ రూ.280, విత్ స్కిన్ రూ.260, శొంఠ్యాం కోడి రూ.300కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1,000గా ఉంది. ఆదివారం కావడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో మాంసం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.

News September 21, 2025

సమయపాలన పాటించని జీవీఎంసీ సిబ్బంది?

image

జీవీఎంసీ ఉద్యోగులందరూ నిర్ణీత సమయానికే విధులకు హాజరుకావాలని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి ఆదేశించారు. శనివారం విశాఖలో అన్ని జోన్ల సిబ్బందితో సమావేశమై ఉదయం9:30 నుంచి సా.5:30 వరకు వీధులు నిర్వహించాలని సూచించారు. చాలాచోట్ల మధ్యాహ్నం విధులకు హాజరు కావడంలేదని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ పూర్తి చేసి పంపించాలని, పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. జోనల్ కమిషనర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.