News October 31, 2025

అరకు అందాల సీజన్‌కు ప్రత్యేక రైళ్లు

image

చల్లని వాతావరణం.. పచ్చని లోయలు, జలపాతాలతో అరకులోయ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ఈ సీజన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వే అరకు–యెలహంకా (బెంగళూరు) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనుంది. దీంతో రాయలసీమ నుంచి నేరుగా అనకాపల్లి, దువ్వాడ మీదుగా అరకు చెరుకునే అవకాశం ఏర్పడింది. ఈ రైళ్లు నవంబర్ 13, 17, 23, 24న మధ్యహ్నం 12కి అరకు నుంచి బయలుదేరుతాయి. అదేవిధంగా 14, 18, 24, 25న యెలహంకా నుంచి మ.1.30-2 గంటల మధ్య తిరుగుపయనమౌతాయి.

Similar News

News October 31, 2025

విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

image

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: vpt.shipping.gov.in

News October 31, 2025

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

image

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.

News October 31, 2025

అనకాపల్లి: ‘భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం’

image

భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ అన్నారు. పెందుర్తి పునరావాస కేంద్రంలో బాధితులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుతో కలిసి నిత్యవసర సరుకులను శుక్రవారం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్లే తక్కువ నష్టం జరిగిందన్నారు.