News May 2, 2024

అరకు, అనకాపల్లిలో గడ్కరీ ప్రచారం

image

విశాఖ ఎయిర్ పోర్టుకు శుక్రవారం 10:45కు నితిన్ గడ్కరీ రానున్నారు. అరకు పార్లమెంటు పరిధిలోని సుందరనారాయణపురం హెలికాఫ్టర్‌లో వెళ్ళనున్నారు. ఉదయం 11:30కు అరుకు పార్లమెంటు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం విశాఖకు హెలికాప్టర్లో చేరుకుని, సాయంత్రం 4:30కి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలో నితిన్ గడ్కరీ పాల్గొంటారు. సాయంత్రం 6:15కు విశాఖ నుంచి బయలుదేరి నాగపూర్ వెళ్తారు.

Similar News

News July 7, 2025

విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

image

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.

News July 7, 2025

విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

image

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.

News July 6, 2025

విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

image

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.