News January 2, 2026

అరకు: ఆస్పత్రి బాత్రూంలో మహిళ డెలివరీ

image

అరకులోయ ఏరియా ఆస్పత్రి బాత్రుంలో శుక్రవారం గుర్తు తెలియని శిశువు మృతదేహం ఉండటం కలకలం రేగింది. బాత్రూంలో గురువారం రాత్రి గుర్తుతెలియని మహిళ చనిపోయిన శిశువుకు జన్మనిచ్చి, అనంతరం ఎవరికి తెలియకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది శుక్రవారం ఉదయం బాత్రూంలో నవజాత శిశువు ఉన్నట్లు గుర్తించారు. CC ఫుటేజ్‌లను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2026

VJA: మార్కెట్లో రూ.2 వేలు.. రెడ్ క్రాస్ ఇస్తామన్నా తీసుకోరు..? (1/3)

image

విజయవాడ GGHలో <<19138621>>బ్లడ్<<>> నిల్వల కొరత రోగులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ.1,450, ప్రైవేట్ సంస్థలు రూ.1,800 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నాయి. రెడ్ క్రాస్ వంటి సంస్థలు తక్కువ ధరకే రక్తాన్ని సరఫరా చేస్తామని, ఆసుపత్రిలో ఒక గదిని కేటాయిస్తే నిరంతరాయంగా రక్తం అందిస్తామని ముందుకొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తలసేమియా రోగులకు ఫ్రీగా బ్లడ్ ఇస్తామని రెడ్ క్రాస్ చెబుతోంది.

News February 14, 2026

MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

image

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News February 14, 2026

నిర్మల్: 17 నుంచి పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు

image

నిర్మల్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జిల్లా విద్యాశాఖ అధికారి, డీసీఈబీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ షెడ్యూల్ ఖరారు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.