News September 7, 2025
అరకు: ‘ఆ ప్రాజెక్టుతో 150 గ్రామాలు జలసమాధి’

5వ షెడ్యూల్ ఏరియాలో చేపట్టాలనుకునే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం అరకులోయ వచ్చిన రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి వినతి పత్రాలు అందిచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం డ్యాం నిర్మిస్తే అనంతగిరి, హుకుంపేట, అరకులోయ మండలాల్లో సుమారు 150 గిరిజన గ్రామాలు జలసమాధి అవుతాయని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు.
Similar News
News September 7, 2025
ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కాంపౌండ్ మెన్స్ టీమ్ విభాగంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో ఫ్రెంచ్ పెయిర్‌పై రిషభ్, ప్రతమేశ్, అమన్‌తో కూడిన భారత జట్టు 235-233 తేడాతో విజయం సాధించింది. దీంతో దేశం తరఫున మొట్టమొదటి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు కాంపౌండ్ మిక్స్‌డ్ ఫైనల్లో జ్యోతిసురేఖ జోడీ ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
News September 7, 2025
GWL: BRS లో ఉన్న.. MLA బండ్ల కీలక వ్యాఖ్యలు

నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీల కంటే గద్వాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. ఇదివరకే స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కేసీఆర్‌ను గౌరవించే వారిలో నేను ముందుంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఏ పార్టీ కండువా కూడా కప్పుకోలేదని స్పష్టం చేశారు.
News September 7, 2025
నేను ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

TG: తాను BRSలోనే ఉన్నానని, వేరే ఏ పార్టీ కండువా కప్పుకోలేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్ నోటీస్‌కు సమాధానం ఇచ్చానని, సీఎంను కలిసిన వివరాలు పొందుపరిచానని పేర్కొన్నారు. కాగా BRS నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే.