News June 5, 2024
అరకు ఎంపీగా డిక్లరేషన్ అందుకున్న తనూజ రాణి

అరకు పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన గుమ్మ తనూజ రాణి రిటర్నింగ్ అధికారి నిషాంత్ కుమార్ నుంచి మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానన్నారు.
Similar News
News November 11, 2025
‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూడాలన్నారు.
News November 11, 2025
విశాఖలో విషాద ఘటన

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
News November 10, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాలని అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు భాగస్వామ్యం కానున్నారని సూచించారు.


