News March 24, 2024

అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

image

TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.

Similar News

News November 4, 2025

విశాఖలో ముమ్మరంగా ఏర్పాట్లు

image

ఈనెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచస్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగళవారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను జేసీ మ‌యూర్ అశోక్‌తో క‌లిసి ప‌రిశీలించి పలు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి 3వేల మంది హాజ‌ర‌వుతార‌న్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 4, 2025

ఎస్.కోట విలీనానికి ‘ఎస్’ అంటారా?

image

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఎస్.కోట నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధుల హామీ తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో విశాఖ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు రాజకీయ నేతలు, ప్రజా సంఘాల వారు మంత్రివర్గ ఉపసంఘానికి వినతులు సమర్పించారు. స్థానిక కూటమి నేతల ప్రపోజల్‌కు అధిష్ఠానం ‘ఎస్’ అంటుందో ‘నో’ అంటుందో చూడాలి.

News November 4, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 65 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.