News March 24, 2024

అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

image

TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాగా.. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.

Similar News

News April 8, 2025

విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బబిత 

image

విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎం.బబితను నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈమె రాష్ట్ర లీగల్ సర్వీస్ ఆథారిటీలో కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి.సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లాలో ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసింది. ఈయన 2022 సంవత్సరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

News April 8, 2025

విజయనగరంలో నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్ 

image

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రసన్న అనే పాసింజర్ తన మొబైల్ ఫోను పోగొట్టుకున్నారు. బస్సు డ్రైవర్ ఆ ఫోన్‌ని గుర్తించి డిపో అధికారులకు ఇచ్చారు. ఫోన్ పోగొట్టుకున్న పాసింజర్ వచ్చి అడగగా అతని వివరాలు తెలుసుకుని స్టేషన్ మేనేజర్ పెద మజ్జి సత్యనారాయణ సమక్షంలో ఫోన్‌ని అందించారు. నిజాయితీ చాటుకున్న డ్రైవర్‌ను పలువురు అభినందించారు.

News April 8, 2025

వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేట్ పెరగాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి పంపాలన్నారు.

error: Content is protected !!