News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

Similar News

News December 24, 2025

విశాఖలో ఆర్టీసీ సేవలపై అవగాహన సదస్సు

image

జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఓ కాలేజీలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కోసం ద్వారకా, మద్దిలపాలెం వంటి ప్రధాన బస్టాండ్లలో ‘డిజిటల్ ఫీడ్ బ్యాక్ స్కానర్లు’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాట్సాప్ (95523 00009) ద్వారా రిజర్వేషన్ సేవలు, శ్రీశక్తి భద్రత కోసం 149 టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు.

News December 24, 2025

విశాఖ: చిల్ట్రన్ ఎరీనా పార్క్ వివాదం.. ఆర్ఐ సస్పెండ్

image

విశాఖ చిల్డ్రన్ ఎరినాలో పార్క్‌ ఆర్ఐ కిరణ్ కుమార్‌ను కమిషన్ సస్పెండ్ చేశారు. మొన్న పార్టీలో చేరికల కార్యక్రమం కోసం వైసీపీ నాయకులు పార్క్‌ను చలానా కట్టి బుక్ చేసుకున్నారు. అయితే ఏరినా ఆవరణలో పార్టీ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆర్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నారు. అయితే పర్మిషన్ ఇచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని వైసీపీ ఆందోళన చేయడంతో దుమారం రేగింది.

News December 24, 2025

విశాఖలో పోలీస్ అధికారిపై కేసు నమోదు

image

గాజువాక ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న ఎంఎస్ఎన్ రాజు తమకు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఐదుగురు కానిస్టేబుల్స్ గాజువాక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోటి ఉద్యోగుల నుంచి పలు దఫాలుగా 16 లక్షల వరకు అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి మోసం చేశారని సీఐ పార్థసారధికి ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి ఏఎస్సై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు