News February 17, 2025

అరకు: క్వెస్ట్‌లో విజేతలకు నగదు బహుమతి

image

అల్లూరి జిల్లా అరకు చలి ఉత్సవంలో ది గ్రేట్ అరకు క్వెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ నగదు బహుమతి ఆదివారం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ధ్రువ అండ్ టీమ్‌కు రూ. 50,000, ద్వితీయ స్థానంలో ఉన్న మంగతల్లి టీమ్‌కు రూ. 30,000, తృతియ బహుమతి రూ. 20,000లను భాస్కర్ రెడ్డి టీమ్‌కి అందజేశారు. మ్యూజియం క్యూరేటర్ వి మురళి, ఆయా బృంద సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

వికారాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత పరిశీలన

image

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత అమలు తీరును పర్యవేక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, వాష్ రూమ్స్, పాఠశాల పరిసరాలు, తరగతి గదుల పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. పరిశుభ్రతపై తనిఖీ చేసేందుకు బృందాలు త్వరలోనే పర్యటించనున్నారు. జిల్లాలో 1,108 పాఠశాలలో ఉండగా, 82,300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

News July 6, 2025

బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

image

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

image

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.