News November 8, 2024
అరకు: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బ్రోచర్ రిలీజ్ చేసిన హీరో
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమ బ్రోచర్‌ను అరకులోయలో షూటింగ్‌కి వచ్చిన హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. గంజాయి, సారా వంటి మాదకద్రవ్యాల నివారణకు, వాటితో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలను హీరో వెంకటేశ్ ప్రశంసించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు.
Similar News
News January 2, 2025
డిప్యూటీ సీఎంకు చటకంభ గ్రామస్థుల విన్నపం
అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో చటకంభ ఉంది. గ్రామంలో 240 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆ గ్రామం మీదుగా 30 గ్రామాలున్నాయి. 15 సంవత్సరాలు క్రితం వేసిన మట్టిరోడ్డు ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో తారురోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లూరి జిల్లా కలెక్టర్‌ను ఆ గ్రామస్థులు విన్నవించుకున్నారు.
News January 2, 2025
యర్రాజీకి విశాఖ ఎంపీ అభినందనలు
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను ఎంపీ భరత్ సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News January 2, 2025
జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించాలి: శాప్ ఛైర్మన్
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.